- విశాల్ నామినేషన్‌పై హైడ్రామా.. నో - ఎస్ - మళ్లీ తిరస్కరణ
- నామినేషన్ తోసిపుచ్చిన రిటర్నింగ్ అధికారి.. మలుపు తిప్పిన ఆడియో
- రాత్రి 11.10కి మళ్లీ మారిన పరిస్థితి.. తిరస్కరిస్తున్నట్లు ప్రకటన
చెన్నై, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తమిళ
రాజకీయాల్లో అడుగు పెట్టగానే అదరగొడుతున్న కథానాయకుడు విశాల్‌కు
నామినేషన్ దశలోనే చుక్కెదురైంది. పట్టువదలకుండా పోరాడినప్పటికీ...
‘క్లైమాక్స్’లో మాత్రం ఫలితం తనకు వ్యతిరేకంగా వచ్చింది. ఆయన నామినేషన్
గంటల వ్యవధిలో తిరస్కరణ, స్వీకరణ... మళ్లీ తిరస్కరణకు గురైంది. అమ్మ జయలలిత
కన్నుమూతతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్‌గా విశాల్
దాఖలు చేసిన నామినేషన్‌పై రోజంతా హైడ్రామా చోటుచేసుకుంది. సోమవారం
నామినేషన్ల దాఖలుకు గడువు ముగియగా ఎన్నికల అధికారులు మంగళవారం వాటిని
పరిశీలించారు.
Sign up here with your email