బంగారం నేల చూపులు

http://cdn3.andhrajyothy.com/AJNewsImages//2017//Dec//20171212//Hyderabad//636487228289368195.jpg
  • నాలుగు నెలల కనిష్ఠ స్థాయిలో పుత్తడి ధర
  •  మరింత తగ్గుతాయని మార్కెట్‌ వర్గాల అంచనా
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : బులియన్‌ మార్కెట్‌ మళ్లీ నేలచూపులు చూస్తోంది. బంగారం ధర మంగళవారం నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి దిగొచ్చింది. గత వారం రోజుల్లోనే 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) పసిడి ధర రూ.1,000 వరకు పడిపోయింది. మంగళవారం హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల మేలిమి పసిడి రూ.29,420 నుంచి రూ.29,480 మధ్య ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 1,244 డాలర్ల దగ్గర ట్రేడవుతుంది. మరో వారం పది రోజుల్లో ఇది 1,200 డాలర్లకు దిగొస్తుందని మార్కెట్‌ వర్గాల అంచనా.
Previous
Next Post »