తెలంగాణలోనూ ఉద్దానం!.. మిగిలింది 20మంది మగవాళ్లే!

 
  • లొద్దిగూడను పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధులు
  • పదిహేనేళ్లలో 60 మంది మృత్యువాత.. 
  • అందరూ పురుషులే.. 
  • మిగిలింది 20మంది మగవాళ్లే!
  • వారిలోనూ ఇద్దరికి వ్యాధి
  • పత్తా లేని వైద్య సాయం
  • పట్టించుకోని అధికార్లు
  • సగం ఊరు ఖాళీ
  • జనం బిక్కుబిక్కు
  • ఫ్లోరైడ్‌ నీరే కారణమా
లింగాపూర్‌, ఆగస్టు 2:
సొంతూరు కన్నతల్లిలాంటిది అంటారు! అక్కడి జనాలకు మాత్రం ఊరే ఉరితాడవుతోంది. ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు మంచం పట్టినవారే కనిపిస్తారు. అందరిలోనూ.. ఏ రోజు ఏ ఇంట్లోంచి చావువార్త వినాల్సి వస్తోందోనన్న భయం! వరుస చావులతో కొందరు ఆందోళన చెంది ఊరువిడిచి పారిపోతే మరికొందరు ఇల్లూ భూమిని వదల్లేక దేవుడిపైనే భారంవేసి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారిని పట్టిపీడిస్తున్న మహమ్మారి ప్రాణాంతకమైన కిడ్నీవ్యాధి! మూకుమ్మడిగా కిడ్నీ వ్యాధులకు గురవుతుండటానికి ప్రధాన కారణం కలుషిత నీరే!! మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ఫ్లోరైడ్‌ నీటినే తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు.
Previous
Next Post »