కేన్సర్‌పై పోరాడే కోడిగుడ్లు రెడీ!


క్యో, అక్టోబరు 10: కోడిగుడ్డు.. అందులో ఉన్న పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఆ పోషకాలతోపాటు కేన్సర్‌పై పోరాడే ప్రోటీన్‌ కూడా ఉంటే.. అవును! నానాటికీ విజృంభిస్తున్న కేన్సర్‌ వ్యాధిపై పోరాడే కోడిగుడ్లను జపాన్‌ శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేశారు. కోడి స్పర్మ్‌లో జన్యుమార్పిడి చేసి మూడు కోళ్లలో ఇంజక్ట్‌ చేశారు. దీని ప్రభావంతో అవి ‘ఇంటర్‌ఫెరాన్‌ బీట’ అనే ప్రోటీన్‌ ఉన్న గుడ్డును ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ప్రోటీన్‌ను ఇప్పటికే కొన్ని రకాల కేన్సర్లు, హెపటైటిస్‌ చికిత్సల్లో వాడుతున్నారు. కొన్ని మైక్రోగ్రామ్‌ల ఇంటర్‌ఫెరాన్‌ ధర రూ. 58వేల వరకూ ఉండగా, ప్రస్తుత ప్రయోగం ద్వారా ఉత్పత్తి అయిన గుడ్డులో 100మిల్లీగ్రాముల ఇంటర్‌ఫెరాన్‌ ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. దీన్ని గుడ్డునుంచి వేరుచేసి కేన్సర్‌ చికిత్సలో వినియోగించబోతున్నట్టు పరిశోధన పత్రంలో వెల్లడించారు.
Previous
Next Post »