నిద్రమాత్రలు మింగిన నటుడు రాజశేఖర్‌



హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ హీరో రాజశేఖర్‌ అర్ధరాత్రి కారుతో రోడ్డుపై ఎందుకు వచ్చారు? ఆయన కారు ప్రమాదానికి గురవడం వెనుక కారణం ఏమిటి? మద్యం గానీ సేవించారా? అయితే.. కుటుంబ సభ్యులతో అప్పటికప్పుడు నెలకొన్న గొడవలతో మనస్తాపం చెందడం.. ఆ క్రమంలో ఆయన నిద్రమాత్రలు తీసుకోవడమే కారణమని తెలిసింది! రాజశేఖర్‌ నడుపుతున్న కారు ఆదివారం అర్ధరాత్రి శివరాంపల్లి పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే 240 పిల్లర్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఓవర్‌టేక్‌ చేసేయత్నంలో మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ వివరాల ప్రకారం.. రాజశేఖర్‌ తల్లి కొద్దిరోజుల క్రితం మరణించారు. అప్పటి నుంచి ఆయన ముభావంగా ఉంటున్నారు. ఎవరితో సరిగా మాట్లాడటం లేదు. సోమవారం ఇంట్లో కార్యం కూడా జరగాల్సి ఉంది.
Previous
Next Post »