ఫేస్‌బుక్‌లో పోస్టు.. 42 రోజుల జైలు  • యూపీలో యువకుడి అరెస్ట్‌
  • సోషల్‌మీడియాతో జర జాగ్రత్త
న్యూఢిల్లీ, అక్టోబరు 11: సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త..! పోస్టులు, కామెంట్లు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందికదా అని ఆన్‌లైన్‌లో హద్దులు దాటారో అంతే సంగతులు. నెట్టింట్లో చెలరేగిపోతే జైల్లోకి నెట్టేసే పరిస్థితి రావచ్చు. అందుకు నిదర్శనమే ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన. జకీర్‌ అలీ త్యాగి(18) ఫేస్‌బుక్‌లో గంగానది, రామ్‌ మందిర నిర్మాణం, ముస్లింలకు హాజ్‌సబ్సిడీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడిని అరె్‌స్ట చేసి ఐపీసీ 420తో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 42 రోజుల జైలు శిక్ష అనంతరం బెయిల్‌పై ముజఫర్‌నగర్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే జకీర్‌ను అరెస్టు చేయడం.. తీవ్రనేరాలు చేసిన ఖైదీలతో పాటు ఉంచడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Previous
Next Post »