16 ఏళ్ల కుర్రాడు.. గూగుల్‌ జాబ్‌ కొట్టాడు  • ఏడాదిపాటు శిక్షణ.. నెలకు రూ.4 లక్షల స్టైపెండ్‌
  • ఆ తర్వాత నుంచి నెలకు రూ.12 లక్షల జీతం
  • చండీగఢ్‌ సర్కారీ బడి విద్యార్థి ప్రతిభ
చండీగఢ్‌, జూలై 31: సర్కారీ బడిలో పన్నెండో తరగతి చదివే కుర్రాడు గూగుల్‌లో జాబ్‌ కొట్టాడు! అదీ.. రూ.1.44 కోట్ల వార్షిక వేతనంతో!! అంటే నెలకు అక్షరాల 12 లక్షల రూపాయలు!! చండీగఢ్‌కు చెందిన హర్షిత్‌ శర్మ విజయగాథ ఇది. అతడి వయసు కేవలం 16 ఏళ్లు. చండీగఢ్‌లోని ‘గవర్నమెంట్‌ మోడల్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌’లో చదువుతున్నాడు. హర్షిత్‌కు చిన్నప్పటి నుంచీ గ్రాఫిక్‌ డిజైనింగ్‌ అంటే చాలా ఇష్టం. పదో ఏట నుంచి మేనమామ రోహిత్‌ శర్మ వద్ద గ్రాఫిక్‌ డిజైనింగ్‌లో శిక్షణ పొందాడు. క్రమంగా అదే అతడి లోకమైపోయింది.
Previous
Next Post »