రైలు మీదగా వెళ్లినా బతికిబయటపడ్డ తల్లి, చంటిబిడ్డ!


సూళ్లూరుపేట(నెల్లూరు జిల్లా): శివుడు ఆజ్ఞాలేనిదే చీమైన కుట్టదన్నట్లు ఆత్మహత్య చేసుకోవాలని ఓ తల్లి చంటిబిడ్డతో సహా రైలు కిందపడినా చిన్నదెబ్బకూడా తగలకుండా వారి మీద నుంచే రైలేళ్లిపోయింది. దీంతో తల్లి బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. సూళ్లూరుపేట రైల్వే ఫ్లైఓవర్‌ వంతెన సమీపంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. సూళ్లూరుపేట కోళ్లమిట్ట సమీపం ఇసుకమిట్టలో ముదాం శివ (29) అతని భార్య లక్ష్మీ (20), రెండేళ్ల కొడుకు లోకేష్‌తో హాయిగా జీవించేవారు. కొంతకాలంగా శివ మద్యానికి బానిసై తాగుబోతుగా మారిపోయాడు. ఫలితంగా రోజు ఇంట్లో గొడవలు జరిగేవి. అలా ఆదివారం ఉదయం కూడా భార్యభర్తలు గొడవపడ్డారు. దీంతో విసిగిపోయిన లక్ష్మీ చంటిబిడ్డ లోకే్‌షను తీసుకుని ఇంటికి సమీపంలోని రైలు పట్టాల పైకి చేరింది. అదే సమయంలో పాట్నా నుంచి యశ్వంత్‌పూర్‌ వెళుతున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ వస్తుండడంతో చంటిబిడ్డ, తాను పట్టాలపై నిలువుగా పడుకున్నారు.
Previous
Next Post »