నిషేధం విధించినా.. విమానంలో ఎంచక్కా ఫ్యారిస్ వెళ్లిపోయిన జేసీ!


హైదరాబాద్: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖ విమానాశ్రయంలో బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వలేదంటూ వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను ఇండిగో, ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌ ఇప్పటికే ఆయన్ను తమ విమానాల్లో అనుమతించబోమని ప్రకటించగా... తాజాగా ఎయిర్‌ ఏషియా, విస్తారా, గోఎయిర్‌ కూడా జేసీపై నిషేధం విధించాయి. జేసీ వ్యవహారంపైచట్ట ప్రకారం చర్యలుంటాయని శుక్రవారం విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు చెప్పారు. ‘‘ఎంపీ కావొచ్చు, మరెవరైనా కావచ్చు... ఎవ్వరూ దురుసుగా ప్రవర్తించవద్ద"ని కేంద్ర మంత్రి సూచించారు.
Previous
Next Post »