పదో అంతస్తు నుంచి బిడ్డను వదిలేశారు.. నేలపై అందుకున్నారు  • లండన్‌ భవన అగ్నిప్రమాదంలో ఓ మహాద్భుతం
లండన్‌, జూన్‌ 14: లేలేత శిశువును ఎత్తుకొని గాల్లోకి ఎగరేస్తాం... అయినా బెంబేలెత్తక ఆ చిన్నారి నవ్వుతుంది.. కేరింతలు కొడతుంది. ఎందుకు? గాల్లోకి ఎగరేసిన వ్యక్తి తనను అందుకుంటాడనే భరోసా ఆ చిన్నారిది!! ఈ కథలో సీన్‌ రివర్సు... విసిరేసిన తన బిడ్డను ఎవరో ఒకరు ‘అందుకోలేకపోతారా’ అనే నమ్మకం ఆ తల్లిది! అంతే.. ఏకంగా భవనంలోని పదో అంతస్తు కిటికీ నుంచి తన కన్నబిడ్డను కిందకు వదిలేసింది. అమ్మో.. బిడ్డ నేరుగా నేలకు తాకితే.. ఇంకేమైనా ఉందా? కింది నుంచి చూస్తున్న అందరిలోనూ ఇదే ఆందోళన... ఉత్కంఠ! కానీ ఆ తల్లి విశ్వాసం వమ్ముకాలేదు. అంతెత్తు నుంచి పడుతున్న ఆ చిన్నారిని ఓ వ్యక్తి అమాంతంగా అందుకున్నాడు. 

Previous
Next Post »