ఉరి ఆగింది!


హేగ్‌, మే 18: పాకిస్థాన్‌ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కులభూషణ్‌ జాదవ్‌కు అక్కడి సైనిక న్యాయస్థానం విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) గురువారం స్టే విధించింది. గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌కు పాక్‌ మరణశిక్ష విధించగా, భారత అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తుది తీర్పు వెలువరించే వరకూ జాదవ్‌కు మరణశిక్ష అమలు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని ఐసీజే పాకిస్థాన్‌ను ఆదేశించింది. వియన్నా ఒడంబడిక ప్రకారం జాదవ్‌ను కలిసేందుకు భారత రాయబార కార్యాలయ సిబ్బందిని అనుమతించాలని పాకిస్థాన్‌కు సూచించింది. ఆ ఒడంబడికపై ఇరు దేశాలు సంతకాలు చేశాయని గుర్తు చేసింది.
Previous
Next Post »