త్వరలో మరో సైబర్‌ బాంబ్‌!


న్యూఢిల్లీ, మే 17: ‘వాన్నా క్రై’ రాన్సమ్‌వేర్‌ దాడి నుంచి తేరుకోక ముందే.. చైనాలో మరో ప్రమాదకరమైన మాల్‌వేర్‌ బయటపడింది. ‘యూఐడబ్ల్యూఐఎక్స్‌’ పేరిట తెరపైకి వచ్చిన ఈ కొత్త వైరస్‌.. వాన్నా క్రైలాగానే పీసీలు, నెట్‌వర్క్‌లపై దాడి చేస్తోంది. ఇది వాన్నా క్రై కన్నా మరింత అప్‌డేటెడ్‌ వర్షన్‌ కావడం వల్ల.. తప్పించుకోవడం కష్టమని నిపుణులు అంటున్నారు. ఇది విండో్‌సలో తాజాగా బయటపడిన లోపాల ఆధారంగానే దాడి చేస్తుంది. ఈ వైర్‌సను ఇప్పటికే పలు ప్రాంతాల్లో గుర్తించినట్లు చైనా జాతీయ కంప్యూటర్‌ వైరస్‌ ఎమెర్జెన్సీ ఎస్పాన్స్‌ సెంటర్‌ తెలిపింది. ఈ వైరస్‌ పీసీలో మొత్తం ఫైళ్లను రీనేమ్‌ చేసి ఎన్‌క్రిప్ట్‌ చేస్తుందని.. డబ్బులు ఇస్తేనే ఆ ఫైళ్లను ఇస్తామని బెదిరిస్తుందని వివరించింది. కాగా.. బ్రిటన్‌.. రష్యాలను వణికించిన వాన్నా క్రై రాన్సమ్‌వేర్‌..
Previous
Next Post »