పిడుగుపాటునూ పసిగట్టారు

(అమరావతి, విశాఖపట్నం, తిరుపతి - ఆంధ్రజ్యోతి): ‘‘అందరూ వినండహో... ఈ రోజు రాత్రి 9 నుంచి 9.30 గంటల మధ్య మన ఊరి పరిసరాల్లో పిడుగులు పడే అవకాశముంది. ఎవ్వరూ బయటికి వెళ్లద్దు’’... మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో చిత్తూరు జిల్లా కుప్పం-పలమనేరు పరిసరాల్లోని పలు గ్రామాల్లో దండోరాలు మోగాయి! స్థానికుల సెల్‌ఫోన్లకు ‘వాయిస్‌ మెసేజ్‌’లు వచ్చాయి. అధికారులు, స్థానిక నాయకులు అప్రమత్తమయ్యారు. అనుకున్నట్లుగానే... ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. రాత్రి 10.30 గంటల వరకు ఆకాశం అల్లకల్లోలంగా మారింది. చెవులు చిల్లులు పడేలా ఉరుములు... కళ్లు మిరిమిట్లు గొల్పేలా మెరుపులు! కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల శివార్లలో రెండు పిడుగులు కూడా పడ్డాయి!
Previous
Next Post »