పిల్లల కోసం 8 మంది హత్య.. అమెరికాలో పేలిన తుపాకీ


బ్రూక్‌హావెన్‌, మే 28: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం. మిసిసిపీ రాష్ట్రంలోని లింకన్‌ కౌంటీలో ఒక వ్యక్తి.. మూడు వేర్వేరుప్రాంతాల్లో కాల్పులు జరిపి ఒక పోలీసు అధికారి సహా ఎనిమిది మందిని బలిగొన్నాడు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగిందిది. ఈ కాల్పుల గురించి సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ వారికి డిప్యూటీ షెరీఫ్‌ విలియం డర్‌(36) మృతదేహంతోపాటు మరో మూడు మృతదేహాలు కనిపించాయి. అక్కడి నుంచి కొద్దిదూరంలో మరో ఇంటివద్ద ఇద్దరు మగపిల్లల మృతదేహాలు.. మరో ఇంటి వద్ద ఇంకో రెండు మృతదేహాలు ఉన్నాయి.
Previous
Next Post »