కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు 50% పెంపుఏప్రిల్‌ నుంచే పెంపు అమలు
కనీస వేతనం రూ.12 వేలు
కేబినెట్‌ నిర్ణయం.. జీఎస్‌టీకి ఓకే
ఏపీ క్రీడా విధానానికి ఆమోదం
పలు శాఖల్లో పోస్టుల మంజూరు
నడవడం కాదు...పరుగెత్తాలి
మంత్రులకు సీఎం నిర్దేశం
అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. వారి వేతనాలను 50 శాతం మేర పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల వేతన పెంపు నిర్ణయంతో వివిధ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న 26 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. గత ఏడాది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం ఈ ఏడాది కాంట్రాక్టు ఉద్యోగులకు చల్లని కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు చాలీచాలని జీతభత్యాలు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి.
Previous
Next Post »