ఆ పాప మా అమ్మాయే : మోగ్లీ గర్ల్ తమ కూతురేనంటూ పోలీసులను ఆశ్రియించిన జంట

moglygirl
లక్నో : యూపీలోని ఒక అడవిలో కోతులతో పాటు జీవిస్తూ పోలీసుల కంటబడిన పాప తమ కూతురేనంటూ ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. కోతులతో కలిసి జీవిస్తూ వాటిలాగే బతికేస్తున్న అమ్మాయిని పోలీసులు పట్టుకుని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. పూర్తిగా కోతి లక్షణాలతో ఉన్న ఆ పాప మా అమ్మాయేనంటూ, ఆము 2012లో తప్పిపోయిందనీ, అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆ జంట చెబుతోంది. మోగ్లీ గర్ల్ గా ఇప్పుడు గుర్తింపు పొందిన ఆ పాప అసలు పేరు లక్షి అని వారు చెబుతున్నారు.డీఎన్ఏ పరీక్ష నిర్వహించి ఆమెను తమకు అప్పగించాలని వారు పోలీసులను కోరుతున్నారు.
Previous
Next Post »