హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో నేడూ వడగాల్పులు

delhi-heatwave-pti
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఎండలకు తోడు వడగాల్పులు కూడా వీస్తుండటంతో జనం వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. మంగళవారం ఒక్కరోజే ఉభయ తెలుగ రాష్ట్రాలలో 33 మంది వడదెబ్బకు మరణించారు. కాగా ఈ రోజు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉ:టుందని వాతావరణ శాఖ పేర్కొంది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకుండా ఉండటం మంచిదని సూచించింది.
Previous
Next Post »