కార్మిక వారసత్వానికి హైకోర్టు బ్రేక్‌

h court
ఆంధ్రప్రభ దినపత్రిక తెలంగాణ ఎడిషన్‌ పేజ్‌వన్‌ స్టోరీ
– ప్రభుత్వ ఉద్యోగాలు వంశపారంపర్యం కాదు
– బాలికలు, దత్తపుత్రులు అనర్హులనడం చట్ట సమ్మతం కాదు
– ఈ పథకం వివక్షతతో కూడినది : హైకోర్టు వ్యాఖ్య
హైదరాబాద్‌ : సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు కీల కమైన తీర్పును వెలివరించింది. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు కట్టబెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఈ పథకం అనారోగ్యంతో అనర్హులైన ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది కేవలం సాధారణ సర్వీసు కు ముందు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రవేశ పెట్టిన పథకంలా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇది వివక్షతో కూడిన పథకం అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పథకంలో బాలికలు, దత్తపుత్రులు అనర్హులని ప్రకటించడం న్యాయోచితం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణ్యం, జస్టిస్‌ జె.ఉమాదేవి తో కూడిన డివిజన్‌ బెంచ్‌
Previous
Next Post »