అసహనమే ఆయుధమైతే.. అది నిరాశ ర్యాలీ!

kodandaram.jpg1
  • ఆంధ్రప్రభ దినపత్రిక: తెలంగాణ ఎడిషన్‌ : ప్రత్యేక ప్రతినిధి స్టోరీ
  • కోదండరాం వైఫల్యానికి కారణాలెన్నో!
  • సామాజిక సమస్యలకు రాజకీయ దృక్కోణం సరికాదు
  • విద్యార్థుల నుంచే జనసమీకరణకు నిర్ణయం
  • పేరుకు నిరుద్యోగ ర్యాలీ
  • సమీకరణమో యూనివర్శిటీల నుంచి
  • కోదండరాం రాజకీయ బాటకు పలు పార్టీలు దూరం దూరం
  • కోదండరాం ఆలోచనాధోరణిలో మార్పు
  • ఉద్యోగ విధానంపై సరైన పంథా లేనందున స్పందన కరువు ప్రభుత్వం ఎంతగా కట్టడి చేసినా అసలు, సిసలైన నిరుద్యోగుల్ని ముందస్తుగా ఆకర్షించుంటే ఈ కార్యక్రమం నీరుగారుండేది కాదన్నది పరిశీలకుల అభిప్రాయం. నిరుద్యోగులు విశ్వవిద్యాలయాల్లోనో, ప్రభుత్వ కార్యాలయాల్లోనో ఉండరు. ప్రతి ఇంటా, ప్రతి వీధి, ప్రతి గల్లిd, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి చోటా ఉంటారు. విద్యార్హతలు అధికంగా ఉన్నవారొక్కరే నిరుద్యోగులుకాదు. ఉపాధి అవకాశాలు కొరవడ్డ ప్రతి ఒక్కరు నిరుద్యోగే. కానీ ఇప్పటికీ కోదండరామ్‌ తన విద్యార్ధుల మీద ఆధారపడే రాజకీయాన్ని శాసించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన తాజా విధానాలు స్పష్టం చేస్తున్నాయి.
Previous
Next Post »