చ‌లికాలం- చ‌ర్మ సంర‌క్ష‌ణ‌


అస‌లే చ‌లికాలం దాంతో శ‌రీరం గ‌రుకుగా త‌యారై ప‌గిలిపోతుంటుంది. కొంత‌మందికి చాలా ఎక్కువ‌గా చ‌ర్మం ప‌గ‌ల‌డం చూస్తూ ఉంటాం. మ‌రికొంద‌రికి చేతులు బాగా డ్రైగా త‌యారై చూడ‌టానికి ఎబ్బెట్టుగా ఉంటాయి. వారి కోస‌మే ఈ చిట్కాలు.
నూనె చర్మానికి తేమను అందిస్తుంది. అందుకే స్నానానికి ముందూ, తరవాతా చేతులకు ఆలివ్‌ లేదా కొబ్బరినూనె రాసుకోవాలి.
ఆలివ్‌నూనె, చక్కెర కలిపి చేతులకు రాసుకుని కాసేపయ్యాక కడిగేస్తే అవి మృదువుగా మారతాయి. సమపాళ్లలో చక్కెరా, ఆలివ్‌ నూనె కలిపి చేతులకు రాసి, రెండు నిమిషాల పాటు మర్దనా చేసి తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే చేతులపై ఉండే మృతచర్మం పోయి.. అవి మృదువుగా మారతాయి.
Previous
Next Post »